Health File హెల్త్ ఫైల్

 Health File

హెల్త్ ఫైల్ 


price;144/-


Health File Book 

హెల్త్ ఫైల్ 
మన శరీరంలో ముఖ్యమైన కర్మాగారం
మన శరీరంలోని ఒక అవయవాన్ని కొంత కట్‌ చేసి తొలగించినా మళ్లీ పెరుగుతుంది. అది ఏ అవయవమో తెలుసా? అది మన శరీర అంతర్గత అవయవాల్లో అతి పెద్దది.
అంతేకాదు, అతి ముఖ్యమైన అవయవం కూడా! దాని పేరేంటో గుర్తొచ్చిందా? కాలేయం. ఇంతకీ కాలేయం ఏం పనిచేస్తుంది? దాని గొప్పతనం ఏంటి
శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కాలేయం. ఎరుపు, గోధుమ వర్ణంలో రెండు భాగాలుగా ఉంటుంది. వీటిని లోబ్స్‌ అంటారు.
కాలేయం పెద్దవారిలో 1.4 కేజీల బరువు ఉంటుంది. రెండు పెద్ద రక్తనాళాలు లివర్‌కు రక్తాన్ని తీసుకొస్తాయి. అవి హెపాటిక్‌ ఆర్టరీ, పోర్టల్‌ వెయిన్‌.
హెపాటిక్‌ ఆర్టరీ గుండె నుంచి నేరుగా ఆక్సిజన్‌ సహిత రక్తాన్ని తీసుకొస్తుంది.
పోర్టల్‌ వెయిన్‌ కూడా రక్తాన్ని తీసుకొస్తుంది. కానీ చిన్న పేగుల్లో నుంచి జీర్ణమైన ఆహారాన్ని కూడా తీసుకొస్తుంది. ఈ రెండు పెద్ద రక్త నాళాలు కాలేయంలో ప్రవేశించాక చిన్న చిన్న రక్తనాళాలుగా విడిపోతాయి.
కాలేయంలో 96 శాతం నీరే ఉంటుంది. కాలేయ కణజాలాల్లో ఆ నీరు నిలువ ఉంటుంది.
ఏం పనిచేస్తుంది?
కాలేయం చాలా రకాల పనులు చేస్తుంది. మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణమయి, శరీరానికి శక్తి రూపంలో అందేలా చేయడంలో కాలేయం పాత్ర కీలకం.
ఆహారం ద్వారా, మందుల ద్వారా శరీరంలోకి ప్రవేశించిన టాక్సిన్స్‌ను తొలగించడంలోనూ కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది.
తీసుకున్న ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్‌ నుంచి గ్లూకోజ్‌ను తయారుచేస్తుంది. ఇందులో కొంత గ్లూకోజ్‌ రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు అందుతుంది.
ఇంకొంత గ్లూకోజ్‌ గ్లైకోజెన్‌ రూపంలో కాలేయంలో నిలువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా పరుగెత్తినప్పుడు, ఎక్కువ పని చేసినప్పుడు ఈ గ్లైకోజెన్‌ విడుదలయి శరీరానికి కావలసిన అదనపు శక్తి లభిస్తుంది.
రక్తంలో ఉన్న టాక్సిన్లను తొలగించే ప్రక్రియను కాలేయమే నిర్వర్తిస్తుంది.
పైత్యరసాన్ని విడుదల చేస్తుంది. ఇది ఆహారం జీర్ణం కావడంలోనూ, కొవ్వుని శరీరం గ్రహించేలా చేయడంలోనూ సహాయపడుతుంది.
ప్రొటీన్స్‌ను అమైనోయాసిడ్స్‌గా మారుస్తుంది. విటమిన్లు, మినరల్స్‌ను నిలువ ఉంచుకుంటుంది.
జ్వరం వచ్చినపుడు మందులు వేసుకుంటారు కదా! ఆ మందులలో ఉన్న పదార్థాలను విడగొట్టే పనిని కాలేయమే చేస్తుంది.
కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ నియంత్రించే పని చేస్తుంది.
ఎలాంటి జబ్బులొస్తాయి?
శరీరంలో ముఖ్య అవయవం కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అతిగా మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. కొన్ని రకాల వైర్‌సల వల్ల కాలేయం పనితీరు దెబ్బతింటుంది.
వాటిలో హెపటైటి్‌స-ఎ, హెపటైటి్‌స-బి,హెపటైటి్‌స-సి ముఖ్యమైనవి.
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ ఫుడ్‌ తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
కాలేయంలో కొంత భాగం దెబ్బతిన్నప్పుడు డాక్టర్లు ఆ భాగాన్నితొలగిస్తారు. అలా
తొలగించినా ఏమీ కాదు. ఎందుకంటే ఆ తొలగించిన భాగం మేరకు కాలేయం మళ్లీ పెరుగుతుంది.
వాక్సిన్‌ తీసుకోవాలి
హెపటైటిస్‌ – బి వ్యాక్సినేషన్‌ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్‌ను అందరూ తప్పక తీసుకోవాలి.

Health Insurance
Healthy Lives Healthy People’
Health Insurance Plans For Family
Star Health Insurance Plans
Aws Health Check
Health Insurance India
Icici Lombard Health Insurance
Best Health Insurance In India



Post a Comment

Previous Post Next Post