Charaka Samhita in Telugu (Ayurveda Grantham)
చరక సంహిత
(ఆయుర్వేద గ్రంథం)
Pages : 1500
price ; 1350/-
Charaka Samhita in Telugu (Ayurveda Grantham) Book
చరక సంహిత (ఆయుర్వేద గ్రంథం)
Pages : 1499
మొత్తం గ్రంథంలో ఎనిమిది స్థానాలు(విభాగాలు), 120 అధ్యాయాలు ఉన్నాయి. ఆ విభాగాలు ఇవి:
సూత్ర (సాధారణ నియమాలు) – 30 అధ్యాయాల్లో ఆరోగ్యకరమైన జీవితం, ఔషధాల సేకరణ-వాటి ఉపయోగాలు, రోగనివారణలు, ఆహారనియమాలు, వైద్యుని బాధ్యతలు ఉన్నాయి.
నిధాన (రోగ విజ్ఞాన శాస్త్రం) – 8 అధ్యాయాలు ఎనిమిది ప్రధానమైన రోగాలు వచ్చే స్థితిగతులను, రోగాల వివరాలను తెలియపరుస్తాయి.
విమాన (నిర్దిష్టమైన నిర్ణయం) – 8 అధ్యాయాలు రోగ విజ్ఞానశాస్త్రం, వివిధ రోగనిర్ధారణ విధానాలు, వైద్యవిద్య, వైద్యవిద్యార్థుల ప్రవర్తన నియమావళి కలిగివుంటాయి.
శరీర (అనాటమీ) – 8 అధ్యాయాల్లో మానవుల అండోత్పత్తి, అవయవ విజ్ఞాన శాస్త్రం ఉంది.
ఇంద్రియ (ఇంద్రియ విషయాలకు రోగనిరూపణ) – 12 అధ్యాయాల్లో రోగనిరూపణ, రోగనిర్ధారణను రోగి ఇంద్రియగత లక్షణాలను అనుసరించి చేయడం తెలుపుతాయి.
చికిత్స – 30 అధ్యాయాలలో విశిష్టమైన రోగ చికిత్సా విధానాల వివరాలున్నాయి.
కల్ప (ఫార్మసూటిక్స్, టాక్సికాలజీ) – 12 అధ్యాయాల్లో ఔషధాల ఉపయోగం, వాటి తయారీ వంటి వివరాలున్నాయి.
సిద్ధి (చికిత్సా విజయం) – 12 అధ్యాయాలు ‘పంచకర్మ’కు సంబంధించిన సాధారణ నియతులు వివరిస్తాయి.
చికిత్స స్థానలో 17 అధ్యాయాలు, పూర్తిగా కల్పస్థాన, సిద్ధిస్థాన అనంతరకాలంలో ద్రద్బలుడు (5వ శతాబ్ది) చేర్చారు[7]. గ్రంథం సూత్రస్థానతో ప్రారంభమవుతుంది. ఈ అధ్యాయం ఆయుర్వేద విధానాల్లోని ప్రాథమిక, మౌలిక సూత్రాలకు సంబంధించింది. చరక సంహిత చేసిన విశిష్ట శాస్త్రీయ కంట్రిబ్యూషన్లలో:
రోగ కారణాలు, చికిత్సలకు సంబంధించి హేతుబద్ధమైన విధానాలు.
లక్ష్యపూర్వకమైన పద్ధతులతో కూడిన రోగపరీక్షను ప్రవేశపెట్టడం వంటివి ఉన్నాయి.
Post a Comment