Sri Rudradhyayam Telugu రుద్రాధ్యాయము ఓ రుద్రా, మంగళకరమైన నీ శరీరం ఏదైతే ఉన్నదో, అఘోర రూపమైన (అహింసాత్మకమైన) మరియు ధుఃఖాన్ని కలిగించని నీ శరీరం ఏదైతే ఉన్నదో, ఆ అనందాన్ని ప్రసాదించే శరీరంతో మమ్ములను ఆశీర్వదించుము.

 Sri Rudradhyayam Telugu

రుద్రాధ్యాయము

ఓ రుద్రా, మంగళకరమైన నీ శరీరం ఏదైతే ఉన్నదో, అఘోర రూపమైన (అహింసాత్మకమైన) మరియు ధుఃఖాన్ని కలిగించని నీ శరీరం ఏదైతే ఉన్నదో, ఆ అనందాన్ని ప్రసాదించే శరీరంతో మమ్ములను ఆశీర్వదించుము.



price ; 250/-

ఓం శ్రీ గురుభ్యో నమః
    రుద్రాధ్యాయము నేర్చుకోవాలని నేను చేస్తున్న ప్రయత్నములో భాగముగా, తరువాత పోస్టులో తెలిపిన గ్రంధముల ఆధారముగా నమకమునకు తెలుగులో వ్రాసుకున్న సంగ్రహమైన అర్ధములను ఈ బ్లాగులో పొందుపరస్తున్నాను. పెద్దలు వ్రాసిన సద్గ్రంధములను వినయముతో అధ్యయనము చేస్తుంటే, అలా అధ్యయనం చేసినవాటిని మహాత్ముల బోధలు, లీలలతో సమన్వయము చేసుకొని మననము చేసుకుంటుంటే, అలానే మనకు అవగతమైనంతమేరకు ఆచరించడము ప్రారంబిస్తే, అప్పుడు సద్గురువుయొక్క అనుగ్రహమువలన వేదమంత్రముల హృదయము మరింత విస్తారముగా, లోతుగా, ఆచరణ యోగ్యముగా అనుభవైక వేద్యమవుతుందని పెద్దల ఉవాచ!అలాకాక, కేవలము సంగ్రహమైన పైపై అర్ధములను తెలుసుకోవడముతోనే ఆగిపోతే పరిమితమైన ప్రయోజనముమాత్రమే సిద్ధిస్తుంది.



Post a Comment

Previous Post Next Post