Shukra Niti శుక్ర నీతి

Shukra Niti

శుక్ర నీతి


price ; 270/-

శుక్ర నీతి:
వీటికి దూరంగా ఉంటే సంతోషం మీ సొంతం!!
సప్తరుషుల్లో ఒకరైన భృగు మహర్షి కుమారుడు శుక్రాచార్యుడు. తండ్రిలాగే శుక్రాచార్యుడు గొప్ప విద్యాంసుడు. ఎన్నో సాహిత్యాలను కూడా రచించాడు.
భృగు మహర్షి కుమారుడు శుక్రాచార్యుడు. తండ్రిలాగే శుక్రాచార్యుడు గొప్ప విద్యాంసుడు. ఎన్నో సాహిత్యాలను కూడా రచించాడు. అంతే కాదు పురణాల ప్రకారం మరణించిన వారిని కూడా బతికించే విజ్ఞాన శాస్త్ర విద్యలో ప్రావీణ్యత సంపాదించాడు. రాక్షసుల గురువుగా పేర్కొనే శుక్రచార్యుడు గొప్ప తత్త్వవేత్త. సత్యయుగంలో శుక్రాచార్యుడు పేర్కొన్న విషయాలు ప్రస్తుత కాలానికి ఎంతో ఉపయోగపడతాయి. ఆయన చెప్పిన విధంగా కొన్ని విషయాలకు దూరంగా ఉంటే జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు.ఎదుటివారిని ఆకర్షించడం నేరం కాదు… అయితే భౌతిక అందం కోసం స్త్రీ లేదా పురుషులు పాకులాడరాదు. దీని వల్ల శారీరక సౌందర్యం మరుగున పడిపోయి మనిషి తన స్వచ్ఛమైన హృదయాన్ని కోల్పోతాడు.
ఈ నిబంధన అనుసరించడం కష్టమైనా, దీని వల్ల ఎంతో ఆనందం సొంతమవుతుంది. భౌతిక అంశాలు, మాయకు దూరంగా ఉండాలి. మనుషులను, వస్తువులను వేర్వేరుగా చూడాలి.

కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసే విషయంలో తనను తాను విశ్వసించాలి కానీ చుట్టూ ఉన్నవారి అభిప్రాయం ప్రకారం కాదు.

ఉన్నత లక్ష్యాన్ని కలిగి ఉండాలి…. దానిపైనే దృష్టి కేంద్రీక‌రించాలి. ఒకవేళ లక్ష్యం పక్కదారి పడితే ఇతరులనే కాదు, మనల్ని కూడా నాశనం చేస్తుంది.

కపట ప్రేమకు దూరంగా ఉండాలి. ఓ తల్లి తన బిడ్డలకు ప్రేమను పంచుతుంది. ఇది నిజమైన ప్రేమ… కేవలం ప్రపంచం కోసం చూసేది, స్థితి బట్టి మారేది ఎక్కడ ఉన్నారో అక్కడకే దారి తీస్తుంది. జీవితంలో ఇలాంటి విషపూరిత ప్రేమలకు దూరంగా ఉండాలి.

జీవితం ఎలా సాగుతుంది.. ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. పరుగెత్తడం ప్రారంభించిన తర్వాత ప్రశ్నించుకోరాదు. గత విషయాలను తలచుకుంటూ బాధపడటంకంటే వర్తమానంలో జీవించాలి.

చర్యకు ప్రతిచర్యలాగే మంచి చేస్తే మంచే జరగుతుంది. కాబట్టి శుక్రాచార్యుడు చెప్పినట్లు ఎల్లప్పుడూ మంచి చేయడానికి ప్రయత్నించాలి. ఎవరైనా చెడుకు ప్రయత్నిస్తే వాటిని విస్మరించి ముందకు సాగాలి.

ఎప్పుడూ విధిపై నమ్మకం ఉంచాలి. అనుకూల లేదా ప్రతికూలతలు ఎదురైనా ఒకేలా స్వీకరించాలి. విధితో పోరాటానికి సిద్ధపడేముందు మీరు చేసిన కర్మలను తెలుసుకోవాలి. దీని వల్ల మీ భాగ్యం మారుతుంది.

గత జన్మలో చేసిన కర్మల ఫలితం ఈ జన్మలో అనుభవిస్తారు. వాటి నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.

కష్టపడి పనిచేస్తే కోరుకున్నది సాధ్యమవుతుంది. జీవితంలో కొన్ని విషయాలను పూర్తిగా పొందలేదని మధపడతాం. పరిస్థితులతో సంబంధం లేకుండా మనసు కోరుకుంటున్న విధంగా పయనం సాగాలి.

చెడు లక్షణాలు కారణంగా ఓ వ్యక్తిని ద్వేషించరాదు.. లోపాలు, అవలక్షణాలను ఒప్పకుంటే ఇతరులు దగ్గరవుతారు. ఒకే వస్తువును ఇద్దరూ కొరుకున్నప్పుడే శత్రువులుగా మారి దక్కించుకోడానికి పోరాటం చేస్తారు.

వయసు, సంపాదన, దేవుడిని పూజించే విధానం, ఆరోగ్యం, ఇతరులకు సాయంచేసే విషయాలు, సామాజాన్ని గౌరవించే విధానం గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు తెలపరాదు. ఇలా చేస్తే తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

బద్దకస్తుడు, తాగుబోతు, స్త్రీలోలుడు, అప్పులు చేసి ఎగ్గొట్టేవాడికి సమాజంలో మనుగడ సాధ్యం కాదు.

తన విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, విధుల నుంచి తప్పించుకు తిరిగేవారు జీవితంలో చాలా కోల్పోతారు.

మనిషికి కులం కారణంగా పరిపాలించే అర్హత రాదు. అది చర్యల ఫలితంగా వస్తుంది. పుట్టుకతో ఎవరూ పేదవారు లేదా అంటరానివారు కాదు. ఇతరులకు కీడు తలపెట్టి, గౌరవించకపోవడమే అంటరానితనం. sukra neeti, sukra neeti


Sukra Niti Hindi Pdf Free Download
Shukra Niti Book In Hindi
Dharmashastra Pdf
Shukra Neeti In Kannada
Shukra Gotra
Shukra Movie Wikipedia
Kamandaka Nitisara Telugu Pdf



Post a Comment

Previous Post Next Post