Vastu Sastra Vignana Sarvaswam -kotipalli Subba Rao వాస్తు శాస్త్ర విజ్ఞాన సర్వస్వం -కోటిపల్లి సుబ్బారావు

 Vastu Sastra Vignana Sarvaswam

-kotipalli Subba Rao

వాస్తు శాస్త్ర

విజ్ఞాన సర్వస్వం

 -కోటిపల్లి సుబ్బారావు


price;441/-
 ఇది మీకు తెలుసా ? మీరు నివసించే ఇల్లు (స్వంత లేక అద్దెదైనా) మీ బాగోగులను చెబుతుంది. ఇల్లు బాగోలేకపోతే, మీ జాతకం బాగున్నా, ఇంట్లో ఉన్న వాస్తు  అంశాల ప్రకారం మీ భవిష్యత్తు నడుస్తుంది. వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మించిన గృహాల్లో నివసించేవారు తప్పనిసరిగా సత్ఫలితాలను పొందుతూ సర్వతోముఖాభివృధి సాధిస్తారు. వాస్తుకు విరుద్ధంగా నిర్మించిన గృహాలు, ఫ్లాట్లలో ఉన్నవారు , పలు కష్టాలను, దుష్ఫలితాలను పొందడం జరుగుతుంది. జాతకాదులను ప్రక్కకు పెడితే , వాస్తు శాస్త్ర బద్ధంగా ఉన్న గృహం లేక  ఫ్లాట్లలో నివసించే వారు వాస్తుకు విరుద్ధంగా ఉన్న గృహంలోని వారికంటే, అధిక సుఖ సంతోష, సంపదలతో జీవిస్తారు.  వాస్తు శాస్త్ర బద్ధంగా  ఉన్న గృహంలో నివసిస్తున్నవారికి జాతకరీత్యా చెడుఫలితాలు కలుగవలసివున్నా, అవి చాలా తక్కువ స్థాయిలో మాత్రమే బాధిస్తాయి. ఈ గ్రంథ రచయిత శ్రీ సుబ్బారావు దేశవిదేశాల యందు గృహాలను పరిశీలించి, అచ్చటి దోషాలను సరిచేయించి, ఎంతో మంది జీవితాల్లో సుఖ సంతోషాలను పెంపొందింపజేశారు. ఈ గ్రంధంలోని 18 అధ్యాయాలలో వాస్తు స్వరూప స్వభావాలు, గృహనిర్మాణావశ్యకత   – ప్రయోజనాలు, భూపరీక్షాక్రమము , భూమి , రోడ్ల ఎత్తు పల్లాలు , అష్టదిశలయందు నివసించేవారి గుణగణాలు, ఆయాదిశల విశిష్టతలు, గృహనిర్మాణ మందలి మెలకువలు, సింహద్వారాలు, కిటికీలు, మెట్లు, నైసర్గిక వాస్తు, నేలమాళిగలు – ప్రభావాలు , వంటగది, గృహనిర్మాణ  దోషాలు – నివారణోపాయాలు, వాపి, కూప తటాకాదులు, వీధి శూలలు, మూలలు మూత పడడం, 105 వేధాదోషాలు, అమెరికాయందలి వాస్తు,  వాస్తుపురుషుడు, ఫెంగ్ షూయి ( చైనా వాస్తు), గృహంలో ఎదురయ్యే సమస్యలు-  నివారణోపయాలు, శంకుస్థాపన, గృహారంభ, గృహప్రవేశ ముహుర్తాలు, భూమిలో ఉండే శల్యాలు – దోషాలు, ఆయం, వాస్తుపదాలు మొదలగునవి  వివరించబడ్డాయి. ప్రజల దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకొని, అభివృద్ధి పధంలో సుఖమయ, ఆనందకరమైన జీవితాన్ని గడుపుటకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.

తామరతూడు

రాజుగారి కొలువులో హాస్యగాడు

గోపురం పర్యాయపదాలు

జానపదాలు

అర్థాన్ని నిర్ధారించుకోండి

పొడుపు కథలు

Post a Comment

Previous Post Next Post