Subha Sekunalu
శుభ శకునాలు
price;36/-
Subha Sekunalu Book
శుభ శకునాలు
కంచిలోని బంగారు, వెండి బల్లి వెనక ఉన్న విశేషం ఏంటి..?!
కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితం వుండదని ఒక నమ్మకం.
బల్లి శరీరం మీద పడిన వారు… కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారం చేస్తే బల్లి పడిన దుష్ఫలితం వుండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉంది.
బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.
కంచి బంగారు, వెండి బల్లి గురించి పురాణగాధ ఏం చెబుతున్నది, బంగారు వెండి బల్లుల విశిష్టత ఏంటో తెలుసుకుందాం…
బంగారు, వెండి బల్లులకి సంబంధించిన పురాణగా«థ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. రోజూ నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు.
అనంతరం దీన్ని చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు.
దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లులు రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది.
ఈ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా వుండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు.
బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ఉంది.
బల్లి ఇంట తిరుగాడుతున్నప్పటీకీ… అది మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది.
అలా బల్లి పడినప్పుడు భయపడకుండా… కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలచుకుని స్నానం చేసి, ఇష్టదేవతారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెబుతారు.
పౌరాణిక ..చారిత్రక నేపథ్యాలను కలిగిన ‘లక్ష్మీ వెంకటేశ్వరస్వామి’ క్షేత్రం ఇక్కడ దర్శమిస్తుంటుంది.
ఇక్కడి అమ్మవారి మందిరం పైకప్పుకి రెండు బల్లులు చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు..ఈ బల్లులను తాకుతుంటారు.
అప్పటి వరకూ బల్లుల మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా నివారించబడుతాయని స్థల పురాణం చెబుతోంది.
————–
బల్లి శాస్త్రం.
————–
బల్లి మన పై పడితే ఫలితము,
ఏ విధముగా ఉండే అవకాసం ఉన్నది
శిరస్సు = కలహం
ముఖము నందు =బంధు దర్శనం
కనుబొమ్మల నడుమ = రాజానుగ్రహం
పై పెదవి =ధన వ్యయం
క్రింది పెదవి = ధన లాభం
ముక్కు చివర =రోగము
కుడి చెవు = దీర్ఘాయువు
ఎడమ చెవి =వ్యాపార లాభం
నేత్రాల యందు = శుభం
గడ్డం నందు =రాజ దండనము
నోటి మీద = ఇస్టాన్న భోజనం
మెడ యందు = పుత్రా జననం
దవడల మెడ =వస్త్ర లాభం
కంఠము నందు = శత్రువు
కుడి భుజం =ఆరోగ్యం
ఎడమ భుజం =స్త్రీ సంభోగం, ఆరోగ్యం
కుడి ముంజేయి = కీర్తి
ఎడమ ముంజేయి =రోగం
హస్తం = ధన లాభం
కనుల మీద =శుభం
చేతి గొళ్ళ యందు = ధన నాశనం
మోకాళ్ళు =స్త్రీ, ధన లాభము
పిక్కల యందు =శుభము
మదములు =శుభము
స్తన భాగం =దోషం
ఉదరం = ధన్య లాభం
రొమ్ము, నాభి = ధన లాభం
పాదం = ప్రయాణం
కాలి గోళ్ళు= నిర్లజ్జ
లింగం = దారిద్యం
జుట్టు కోన =మృత్యువు
దేహము పై పరిగెడితే = దీర్ఘాయువు
మీద పడి, వెను వెంటనే వెళిపోతే, దానంతట అది =మంచిది
పురుషులకు..
తలమీద కలహం
పాదముల వెనక ప్రయాణము
కాలివ్రేళ్లు రోగపీడ
పాదములపై కష్టము
మీసముపై కష్టము
తొడలపై వస్త్రనాశనము
ఎడమ భుజము అగౌరవము
కుడి భుజము కష్టము
వ్రేళ్ళపై స్నేహితులరాక
మోచేయి ధనహాని
మణికట్టునందు అలంకారప్రాప్తి
చేతియందు ధననష్టం
ఎడమ మూపు రాజభయం
నోటియందు రోగప్రాప్తి
రెండు పెదవులపై మృత్యువు
క్రింది పెదవి ధనలాభం
పైపెదవి కలహము
ఎడమచెవి లాభము
కుడిచెవి దుఃఖం
నుదురు బంధుసన్యాసం
కుడికన్ను అపజయం
ఎడమకన్ను శుభం
ముఖము ధనలాభం
బ్రహ్మరంద్రమున మృత్యువు
స్త్రీలకు..
తలమీద మరణసంకటం
కొప్పుపై రోగభయం
పిక్కలు బంధుదర్శనం
ఎడమకన్ను భర్తప్రేమ
కుడికన్ను మనోవ్యధ
వక్షమున అత్యంతసుఖము,పుత్రలాభం
కుడి చెవి ధనలాభం
పై పెదవి విరోధములు
క్రిందిపెదవి నూతన వస్తులాభము
రెండుపెదవులు కష్టము
స్తనమునందు అధిక దుఃఖము
వీపుయందు మరణవార్త
గోళ్ళయందు కలహము
చేయుయందు ధననష్టము
కుడిచేయి ధనలాభం
ఎడమచేయి మనోచలనము
వ్రేళ్ళపై భూషణప్రాప్తి
కుడిభుజము కామరతి, సుఖము
బాహువులు రత్నభూషణప్రాప్తి
తొడలు వ్యభిచారము,కామము
మోకాళ్ళు బంధనము
చీలమండలు కష్టము
కుడికాలు శత్రునాశనము
కాలివ్రేళ్ళు పుత్రలాభం.
వీటికి పరిహారం గా…కంచిలోని
వెండి..బంగారు బల్లి ముట్టుకుని వస్తే
దోషాలు పోతాయి…
భయపడాలిసిందేమి లేదు..!
జీవితంలో ఒక్కసారి వెళ్లి తాకి వస్తే చాలు..
పడ్డ ప్రతీ సారీ.. పరుగు పెట్టక్కరలేదు..కంచికి..!!
Post a Comment