soundarya lahari telugu సౌందర్య లహరి – యంత్ర మంత్ర రత్నావళి

soundarya lahari telugu
సౌందర్య లహరి – యంత్ర మంత్ర రత్నావళి

price ; 90/-

Soundaryalahari Book

సౌందర్య లహరి – యంత్ర మంత్ర రత్నావళి

ఆది శంకరాచార్యులు జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంథము సౌందర్యలహరి. ఇది స్తోత్రము (భక్తితో భగవంతుని కీర్తిస్తూ ఆరాధించే గాన పాఠము), మంత్రము (గురువు అనుగ్రహం పొంది నిష్టతో జపించుట వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము), తంత్రము (నియమంతో శాస్త్రయుక్తంగా సాధన చేస్తే ప్రత్యేక సిద్ధులు లభించే యోగవిధానము), కావ్యము (అక్షర రమ్యతతో కూడిన ఛందో బద్ధమైన, ఇతివృత్తాత్మక రచన) కూడాను. దీనిని ఆనందలహరి, సౌందర్యలహరి యని రెండు భాగములుగా విభజించియున్నారు. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి అని చెప్పుదురు. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు గలవు. మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్టపరచుచున్నవి. సౌందర్యలహరి అను పేరునందు సౌ, లహ, హ్రీం అను మంత్ర బీజములు ద్యోతకమగుచున్నవి.

సౌందర్య లహరి స్తోత్రావిర్భావం గురించి ఒక గాథ ప్రచారంలో ఉంది. ఆదిశంకరులు ఒకమారు స్వయంగా కైలాసం వెళ్ళారట. అక్కడ వ్రాసి ఉన్న ఈ శ్లోకాన్ని చదువుతుండగా వినాయకుడు దానిని క్రిందినుండి చెరిపేశాడట. ఎందుకంటే అది మానవులకు అందరాని అత్యంతగుహ్య విద్య గనుక. అలా శంకరులు మొదటి 40 శ్లోకాలు మాత్రమే చదివినారు. వాటికి తోడు మరొక 60 శ్లోకాలు శంకరాచార్యులు రచించారు. ఆ వంద శ్లోకాలు కలిపి సౌందర్య లహరిగా ప్రసిద్ధమయ్యాయి. ఈ కథకు వివిధ రూపాంతరాలున్నాయి. ఏమయినా మొదటి 40 శ్లోకాలు యంత్ర తంత్ర విధాన రహస్యాలు తెలుపుతుండగా తరువాతివి శ్రీమాత యొక్క సౌందర్యాన్ని కీర్తిస్తున్నాయి.

సౌందర్య లహరి శ్రీ శంకర భగవత్పాదుల విరచితం. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మహామంత్రం. దీనిలో ప్రతి శ్లోకానికి ఇవ్వబడిన యంత్రాలను విధి విధానంగా ఎవరు అర్చించిన ఫలితం తద్యం. సందేహం లేదు. ఈ విశేష విశిష్ట గ్రంధాన్ని సమాదారించి, మా కృషికి సార్ధకత చేకుర్చగాలరని ఆకాంక్షిస్తున్నాం.

సౌందర్యలహరిలోని శ్లోకాలు మంత్రాలుగా కూడా భావింపబడుతాయి. ఒక్కొక్క శ్లోకం నియమానుసారం ఉపాసిస్తే ఒక్కో ప్రయోజనం లేదా సిద్ధి లభిస్తుందని విశ్వాసం. ఉదాహరణకు –

మొదటి శ్లోకము – దినమునకు 100సార్లు చొప్పున 12 దినాలు జపించి త్రిమధురము (బెల్లము+నేయి+కొబ్బరి) లేదా మధురమైన అపూపము నైవేధ్యంగా పెడితే ఇష్ట సిద్ధి, అభ్యుదయము, సకల విఘ్ననివారణ కలుగుతాయి.
11వ శ్లోకము – దినమునకు 100సార్లు చొప్పున 8 దినాలు జపించి బెల్లపు పానకము, వెన్న, గారెలు మహానైవేద్యం పెట్ఠాలి. ఈ శ్లోకాన్ని రాగిరేకుపై వ్రాసి మొలతాడులో తాయెత్తుగా కట్టుకొనాలి. అప్పుడు వంధ్యత్వం నశిస్తుంది.
20వ శ్లోకం- విభూతిలో గాని, నీటిలో గాని వ్రాసి 1000 సార్లు జపిస్తే విషం విరుగిపోతుంది. దినమునకు 2000 సార్లు చొప్పున 45 దినములు జపిస్తే సర్పవశీకరణ లభిస్తుంది.
43వ శ్లోకం- దినమునకు 3000 సార్లు చొప్పున 40 దినములు జపించి తేనెను నైవేద్యంగా పెట్టి ఉంగరముగా తాయెత్తు ధరిస్తే అందరిని ఆకర్షించే శక్తి లభిస్తుంది.
91వ శ్లోకం- దినమునకు 1000 సార్లు చొప్పున 45 దినములు పాయసమును నైవేద్యంగా పెడితే భూమి, ధనము సిద్ధిస్తాయి.
103వ శ్లోకం- 45 దినాలలో మొత్తం లక్ష సార్లు జపించి, పండ్లు కొబ్బరికాయ నైవేద్యం సమర్పించాలి. సకల వాంఛాసిద్ధి యగును.


Soundarya Lahari Telugu Pdf
Soundarya Lahari Telugu With Meaning
Soundarya Lahari Telugu Lo
Soundarya Lahari Telugu Book With Meaning
Soundarya Lahari Telugu Wikipedia
Soundarya Lahari Telugu Book Online
సౌందర్య లహరి లిరిక్స్ ఇన్ తెలుగు
Soundarya Lahari Telugu Stotra Nidhi







Post a Comment

Previous Post Next Post