Simha Lagnam సింహ లగ్నం Author: Pucha Srinivasa Rao Pages: 164

 Simha Lagnam

సింహ లగ్నం

Author: Pucha Srinivasa Rao

Pages: 164


price;99/-


Simha Lagnam Book

సింహ లగ్నం
Author: Pucha Srinivasa Rao
Pages: 164
ద్వాదశ రాశులను గురించి లేదా ద్వాదశ లగ్నాల గురించి భారతీయ భావనలు ఎలా ఉన్నాయి. పాశ్చాత్యుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలియజేసే రచనలు తెలుగులో లేవనే చెప్పవచ్చును.
రాశీ ఫలితాలు, పరిహారాలను గురించి తెలియజేసే పుస్తకాలున్నా ఖగోళం ఆ రాశీ స్వరూపం ఏమిటి, పాశ్చాత్యులు భావనలు ఎలా ఉన్నాయి వారు ఈ లక్షణాలను ఎలా విశ్లేషించారు అనే విషయాలు మనకు పెద్దగా తెలియవనే చెప్పాలి.
దీనిని దృష్టిలో పెట్టుకొని అందరికి ఉపయోగపడేలా అంటే ఆయా లగ్నాలవారికి, ఆయారాశులు చంద్రదాశులవారికి, సౌరమానం ప్రకారం ఫలితాలు సరిపోయేలా ఈ రచనను ప్రణాళిక చేయబడి ఈ నాటికి మీ చేతులలోకి వచ్చింది.
రాశీ చక్రంలో ఐదవరాశిగా చెప్పుకొనేది సింహరాశి. కర్కాటకరాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 120 – 150 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి.
మఖ 4, పుబ్బ 4, ఉత్తర 1 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం ఆగష్ట్ 17- సెప్టెంబర్ 17 మధ్యలో పుట్టిన వారిని సింహరాశి జాతకులుగా చెప్పబడ్డారు.
మీరు సింహ లగ్నం, సింహరాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు
1. ఆకర్షనీయమైన రూపం కలిగినవారైతే,
2. స్వతంత్ర ఆలోచనలు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేవారైతే
3. కార్యనిర్వహణా సామర్థ్యం కలిగినవారైతే
4. అహంకారం ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటే
5. నమ్మదగినవారు, మంచివారనే పేరు కలిగినవారైతే
6. ఆశావహ దృక్పథము కలిగినవారైతే
7. విశేషమైన శక్తి యుక్తులు కలిగినవారైతే
8. ముక్కుసూటిగా ప్రవర్తించేవారైతే
9. ముక్కుసూటితనం కలిగినవారైతే
10. పొగడ్తలంటే ఇష్టత కలిగినవారైతే …
మీరు తప్పకుండా సింహరాశివారే … ఇక పుస్తకం చదవండి….



Post a Comment

Previous Post Next Post