Shivananda Lahari Telugu -Neti Suryanarayana Sarma శివానందలహరి -నేతి సూర్యనారాయణ శర్మ

Shivananda Lahari Telugu -Neti Suryanarayana Sarma

శివానందలహరి -నేతి సూర్యనారాయణ శర్మ 


price ; 108/-

శివానంద లహరి

ఆదిశంకరుల స్తోత్రసాహిత్యంలో శిఖరాయమానం శివానందలహరి. దీనిని రచిస్తున్నవేళ సాక్షాత్తూ కైలాస శివుడే శంకరునిపై ఫాలధార, పంచధారలు కురిపించాడంటారు. శివానందం రసమై, మహాప్రవాహమై నేలకు దిగివచ్చేలా చేసిన అపురూప కావ్యం శివానందలహరి. దీనిని అర్థం చేసుకుంటే శివభక్తిలోని లోతులు తెలుస్తాయి. ఎలా ప్రార్థిస్తే శివుడు భక్తుడికి వశుడవుతాడో తెలుస్తుంది. గురువుగా శంకరుని నిలుపుకుని, లక్ష్యంగా శివుని చేసుకుని శివానంద లహరిని సాధన చేసిన భక్తుడికి మోక్షశిఖరం చేరువలో కనిపిస్తుంది.

ఆదిశంకరుల శివానందలహరిపై ఇప్పటివరకూ ఎన్నెన్నో వ్యాఖ్యాన గ్రంథాలున్నాయి. అవన్నీ సంస్కృతభాషను నేర్పిస్తాయి. వ్యాకరణాన్ని, ఇతర శాస్త్రాలనూ బోధిస్తాయి. కవితా సౌందర్యాన్ని చెబుతాయి. శంకరవిజయం నవలాకర్త నేతి సూర్యనారాయణ శర్మ రచించిన ఈ రసదీపికా వ్యాఖ్య ఆదిశంకరుల శివానందలహరిలో ప్రవహించే గుణమున్న రసమేమిటో పాఠకుడికి కన్నులకు కడుతుంది. ఒకవైపు శివభక్తి పారవశ్యంలో ముంచెత్తే రచన, మరోవైపు దాన్ని దృశ్యబద్ధం చేసిన పావులూరి చిదంబరం బొమ్మలు ఈ పుస్తకానికి వన్నె తెచ్చాయి. ప్రతి శ్లోకమూ వ్యాఖ్యగా చదివించి మైమరిపిస్తుంది. బొమ్మగా కనిపించి రసానుభూతిని రెట్టింపు చేస్తుంది.

శివానందలహరి
రసదీపికా వ్యాఖ్య : నేతి సూర్యనారాయణశర్మ
పీఠిక : డా. ధూళిపాళ మహాదేవమణి
ముందుమాట : రంగావజ్ఝల మురళీధరరావు
చిత్రదీపిక : పి. చిదంబరం

Sivananda Lahari -Nethi Suryanarayana Sarma


Shivananda Lahari Telugu Meaning Pdf
Sivananda Lahari With Meaning Pdf
Shivananda Lahari Slokas In Telugu
Sivananda Lahari With Meaning
సౌందర్యలహరి శ్లోకాలు Pdf
Sivananda Lahari Bhashyam
శివానంద లహరి లిరిక్స్
శివానందలహరి Pdf



Post a Comment

Previous Post Next Post