Sarva Devata Pooja Vidhanam సర్వ దేవతా పూజా విధానం

 Sarva Devata Pooja Vidhanam సర్వ దేవతా పూజా విధానం 


price ; 36/-

సర్వ దేవతా పూజా విధానం 

శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ విశిష్టత
*విలువ తెలిస్తే ఈస్తోత్రం చేసే మేలు అంతా ఇంతా కాదు అని శ్రీ షిరిడీ సాయిబాబా అంతటి వారు కూడా ఒక సందర్భంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పుస్తకాన్ని తన హృదయానికత్తుకొని.. “ఈ స్తోత్రం ఎన్నోసార్లు నన్ను ఎన్నో సమస్యల నుండి కాపాడింది. మీరంతా నిత్యం పఠించమని..” శ్యామాతో పలికారు.*

*”ఈ దైనందిన జీవితంలో సామాన్య మానవుల సకల సమస్యలకు పరిష్కారమేంటి? ” అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకు.. భీష్మపితామహులు మానవ జాతికి ఉపదేశించిన స్తోత్రమే శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం.*

*శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొత్తం 108 శ్లోకాలుంటాయి. సహస్రం అంటే “వెయ్యి (1000)” అని అర్థం. వెయ్యి నామాలన్నీ కూడా ఆ శ్రీమన్నారాయణుని స్తుతించే నామాలే. అత్యంత శక్తివంతమైన శ్లోకాలవి. ఒక్కో శ్లోకంలో ఒక్కో సందర్భానికి తగినట్లుగా.. ఒక్కో సమస్యను పరిష్కరించే శక్తి దాగివుంది. అందుకే…*

*ధనాభివృద్ధికి- విష్ణు సహస్రనామమే..*
*మంచి ఆరోగ్యానికి- విష్ణు సహస్రనామమే..*
*విద్యాభివృద్ధికి- విష్ణు సహస్రనామమే..*
*మనశ్శాంతికి- విష్ణు సహస్రనామమే..*
*ఇంతేనా..! ఇలా నిత్య జీవితంలో మానవులేదుర్కొనే ప్రతీ సమస్యకు పరిష్కారం చూపింది మన “శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం”.*

*అందుకే ప్రపంచదేశాలలో సైతం ఈనాడు జాతి, మత, భాషలకు అతీతంగా శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం నేర్పిస్తున్నారు.. పఠిస్తున్నారు.*

*కాబట్టి సమస్యల పరిష్కారానికి, అభీష్ట సిద్ధికి (కోరిక నెరవేరుటకు) విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చాలా శ్రేయస్కరము. ఎవరి కోరికనను అనుసరించి వారు ఈ క్రింద సూచించిన శ్లోకములను 108 మార్లు జపించవలెను. పిల్లల క్షేమార్థము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:*

*1. విద్యాభివృద్ధికి: (14 వ శ్లోకం)*
*—————————————-*
*సర్వగః సర్వ విద్భానుర్ విష్వక్సేనో జనార్దనః ౹*
*వేదోవేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ౹౹*

*2. ఉదర రోగ నివృత్తికి: (16 వ శ్లోకం)*
*—————————————-*
*భ్రాజిష్ణుర్ భోజనం భోక్తా సహిష్ణుర్ జగదాదిజః ౹*
*అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః౹౹*

*3. ఉత్సాహమునకు: (18 వ శ్లోకం)*
*—————————————-*
*వేద్యోవైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః ౹*
*అతీంద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః౹౹*

*4. మేధాసంపత్తికి: (19 వ శ్లోకం)*
*—————————————-*
*మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః ౹*
*అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ౹౹*

*5. కంటి చూపునకు: (24 వ శ్లోకం)*
*—————————————-*
*అగ్రణీర్ గ్రామణీః శ్రీమాన్ న్యాయోనేతా సమీరణః ౹*
*సహస్రమూర్థావిశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్౹౹*

*6. కోరికలీరేడుటకు: (27 వ శ్లోకం)*
*—————————————-*
*అసంఖ్యేయో2ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృత్శుచిః౹*
*సిద్ధార్థః సిధ్ధ సంకల్పః సిద్ధిదః సిధ్ధిసాధనః ౹౹*

*7. వివాహ ప్రాప్తికి: (32 వ శ్లోకం)*
*—————————————-*
*భూతభవ్య భవన్నాథః పవనః పావనో2నలః ౹*
*కామహాకామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ౹౹*

*8. అభివృద్ధికి: (42 వ శ్లోకం)*
*—————————————-*
*వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదోధృవః౹*
*పరర్థిః పరమ స్పష్ట: తుష్ట: పుష్టః శుభేక్షణః ౹౹*

*9. మరణ భీతి తొలగుటకు: (44 వ శ్లోకం)*
*—————————————-*
*వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ౹*
*హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ౹౹*

*10. కుటుంబ ధనాభివృద్ధికి: (46 వ శ్లోకం)*
*—————————————-*
*విస్తారః స్థావరఃస్థాణుః ప్రమాణం బీజమవ్యయం ౹*
*అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ౹౹*

*11. జ్ఞానాభివృద్ధికి: (48 వ శ్లోకం)*
*—————————————-*
*యజ్ఞఇజ్యో మహేజ్యశ్చః క్రతుస్సత్రం సతాంగతిః ౹*
*సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం ౹౹*

*12. క్షేమాభివృధ్ధికి: (64 వ శ్లోకం)*
*—————————————-*
*అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమ కృచ్ఛివః ౹*
*శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః ౹౹*

*13. నిరంతర దైవ చింతనకు: (65 వ శ్లోకం)*
*—————————————-*
*శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ౹*
*శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ౹౹*

*14. దుఃఖ నివారణకు: (67 వ శ్లోకం)*
*—————————————-*
*ఉదీర్ణ స్సర్వతశ్చక్షు రనీశః శాశ్వత స్థిరః ౹*
*భూశయో భూషణోభూతి ర్విశోకః శోకనాశనః ౹౹*

*15. జన్మ రాహిత్యమునకు: (75 వ శ్లోకం)*
*—————————————-*
*సద్గతి స్సత్కృతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః ౹*
*శూరసేనోయదుశ్రేష్ఠ స్సన్నివాసఃసుయామునః౹౹*

*16. శత్రువుల జయించుటకు:(88 వ శ్లోకం)*
*—————————————-*

*సులభస్సువ్రతః సిద్ధశ్శత్రుజిత్ శత్రు తాపనః ౹*
*న్యగ్రోధోదుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః౹౹*
*17. భయ నాశనముకు: (89 వ శ్లోకం)*
*—————————————-*
*సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |*
*అమూర్తి రణఘో2చింత్యో భయకృత్ భయ నాశనః ||*

*18. మంగళ ప్రాప్తికి: (96 వ శ్లోకం)*
*—————————————-*
*సనాత్ సనాతనతమః కపిలః కపి రవ్యయః ౹*
*స్వస్తిదఃస్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః౹౹*

*19. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు: (97,98 శ్లోకాలు)*
*—————————————-*
*అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః ౹*
*శబ్దాదిగః శబ్దసహః శిశిరః శర్వరీ కరః ౹౹*

*అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ౹*
*విద్వత్తమో వీతభయః పుణ్యః శ్రవణ కీర్తనః ౹౹*

*20. దుస్వప్న నాశనమునకు:(99 వ శ్లోకం)*
*—————————————-*
*ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః ౹*
*వీరహా రక్షణః సంతో జీవనః పర్యవస్తితః ౹౹*

*21. పాపక్షయమునకు: (106 వ శ్లోకం)*
*—————————————-*
*ఆత్మయోనిస్స్వయం జాతో వైఖానః సామగాయనః ౹*
*దేవకీ నందనః స్రష్టా క్షితీశః.


Sarva Devata Nitya Pooja Vidhanam Pdf
Sakala Devatha Pooja Vidhanam In Telugu Pdf
Sarva Devatha Pooja Vidhanam Book
Nitya Pooja Vidhanam Book
Daily Pooja Procedure At Home
Sri Krishna Shodashopachara Pooja Telugu Pdf
Pooja Vidhanam Telugu Lo
Nitya Puja Paddhati Pdf



Post a Comment

Previous Post Next Post