Sampoorna Mudra Vignanam Telugu Dharanipragada Prakash Rao సంపూర్ణ ముద్రా విజ్ఞానం ధరణీప్రగడ ప్రకాష్ రావు & ధరణీప్రగడ దీప్తి

 Sampoorna Mudra Vignanam Telugu

Dharanipragada Prakash Rao

సంపూర్ణ

ముద్రా విజ్ఞానం

 ధరణీప్రగడ ప్రకాష్ రావు & ధరణీప్రగడ దీప్తి 



price;550/-

Rs.50/- For Handling and Shipping Charges


Sampoorna Mudra Vignanam-Mudralapai Samagra Vishleshana |


Mudralu Bandhalu

మనస్సును, శరీరంలోని తత్వాలను, శక్తి ప్రసారాన్ని నియమించడం కోసమే ముద్రలను ఉపయోగిస్తారు. ఈ ముద్రలు యజ్ఞాది కార్యాలలోనూ, వైదిక కర్మలలోను హఠయోగాది ప్రక్రియలలోను, ఆలయాల్లో దేవతారాధనకీ, దేవతా శిల్పాల నిర్మాణం లోను, నాట్యంలోను ఉపయోగిస్తారు. అంతర్భహిర్లోకాలకి వంతెన వంటివి ముద్రలు.


ముద్రలు అనేది హఠ యోగులు, తపస్సంపన్నులు చేయవలసినవి అని బహు జనాభిప్రాయము కానీ కొన్ని తప్పించి చాలా ముద్రలు అందరూ చేయవచ్చును, ముద్రల సాధనను తగిన గురువు వద్ద శిక్షణ పొందవలెను. ఈ ముద్రలు బంధాలు అన్నీ ప్రతి రోజు చేయనక్కరలేదు. ఎవరి కేది అత్యంతావస్యకమో వారు దానిని మాత్రమే అభ్యసించుట మంచిది. శరీరంలో వివిధ అంగాలను పటిష్టం చేయడానికి ఆసనాలు నిర్దేశించబడ్డాయి. అవి వ్యాయామానికి భిన్నమైనవి. వ్యాయామం వల్ల శరీరంలోని కండరాలు బలపడతాయే కాని నరాల మీద ప్రభావం ఉండదు. ఆసనాలు తమ ప్రభావాన్ని శరీరంలోని అంతర్భాగాలను కూడా ప్రభావితం చేస్తాయి. వ్యాయామం మోటు అయితే ఆసనాలు సున్నితమైనవి. ఆసనాల కంటే ముద్రలు లోతైనవి. ఇవి శరీరాంగాలకు అతీత శక్తులకు సంబంధించినవి. వాటి ద్వారా జ్ఞానేంద్రియాలను ప్రభావితం చేసి లోపాలను సవరించవచ్చును.


మన భారతీయ సంస్కృతికి యోగ శాస్త్రం మూలస్తంభం వంటిది. వాటిలో ఈ ముద్రలు కూడా ఒక భాగమే. ఎందరో పెద్దలు చెప్పిన, వ్రాసిన సమాహార సంకలనమే ఈ గ్రంధము. ఇందున 390 ముద్రల సేకరించి, 370 చిత్రములతో పొందుపరచితిని. వాటి సాధన వల్ల కొన్ని శారీరక శుద్ధి విధానాలు, మానసిక శుద్ధి విధానాలు, ఆధ్యాత్మిక లాభాలు కలవు. అందువల్ల ఈ పుస్తక పఠనం ఆనందమే కాక ఆరోగ్యం కూడా అందించగలదు. – ధరణీప్రగడ ప్రకాశరావు


Sampoorna Mudra Vignan Telugu


Sampoorna Mudra Vignan Telugu

Sampoorna Mudra Vigyan Pdf

Mudralu Bandhalu Book Pdf

Dharanipragada Prakash Rao Book Pdf

Post a Comment

Previous Post Next Post