Kalalu Phalitalu కలలు ఫలితాలు

 Kalalu Phalitalu

 కలలు ఫలితాలు



price;30/-


Kalalu Phalitalu book

 కలలు ఫలితాలు
పదకొండు పీడకలలు… మళ్లీ మళ్లీ పీడించే పీడకలలు…ఇవన్నీ ‘పీడకలా’ చిత్రాలు
‘దిండు’పాళ్యాలు దీంట్లో మిమ్మల్ని వెంటాడే పీడకల ఏది?
ఆమె పరుగెత్తుతూ ఉంది. ఎవరో వెంటపడుతున్నట్లు భయపడుతూ
పరిగెత్తుతూ ఉంది.తప్పించుకోవాంటే కుదరడం లేదు. అకస్మాత్తుగా ఒక అగాధం.
పరుగు కంట్రోల్‌ కాలేదు.వెనకా ముందూ చూసుకోకుండా ఆగాధంలోకి
పడిపోయింది. అంతే.
అంతెత్తు నుంచిఅగాధంలోకి జారిపోతుండగా…. కెవ్వు…
లేచి కూచుందామె. అప్పటికిగానీ తెలియలేదు…అది కల అని తాను నిద్రలో ఉందని.
ఏసీలో ఉన్నా ఒళ్లంతాచెమటలు.
సురక్షితంగా ఉన్నామేనంతా వణుకు. ఇది ఆమెకు
తరచూ వచ్చే కల.
ఇలా అవే కలలు తరచూ వచ్చే మానసిక సమస్య పేరే ‘పీడకలల రుగ్మత’.
ఇంగ్లిష్‌లో చెప్పాలంటే ‘నైట్‌మేర్‌ డిజార్డర్‌’.
Kalalu Phalitalu book
పీడకలలు మాటిమాటికీ ఎందుకొస్తాయి? తీవ్రమైన మానసిక ఒత్తిడి కలిగినప్పుడు…
అత్యంత వేదనాపూరితమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు
ఈ కలల రుగ్మతకు లోనవుతుంటారు. జీవితంలోని ఏదో ఒక సమయంలో పీడకలలు
రానివారుండరు.
అయితే ఆ కలలు వారి రోజును అన్ని విధాలా దుర్భరం చేస్తున్నప్పుడు
దాన్ని పీడకలల రుగ్మతగా గుర్తిస్తారు.
ఈ పీడకలలు రెండు రకాలుగా వస్తుంటాయి.
మొదటి రకంలో పీడకల వచ్చి ఆ వేదనతో దిగ్గున లేచి కూర్చుంటారు.కల  తీవ్రత
వల్ల ఒళ్లంతా చెమటలతో తడిసిపోతూ, భయంతో వణికిపోతూ ఉంటారు.
ఈ తరహా కలలు మెలకువ వచ్చాక కూడా గుర్తుంటాయి. ఇలాంటి కలలతో
బాధపడే సమస్యను ‘నైట్‌మేర్‌ డిజార్డర్‌’గా చెప్పవచ్చు.
అయితే కొందరిలో మెలకువ
వచ్చాక తమకు వచ్చిన భయంకరమైన కల ఏమాత్రం గుర్తుండదు.
అయితే ఆ వేదనమాత్రం ఉండిపోతుంది. ఆ కండిషన్‌ను ‘నైట్‌ టెర్రర్‌’గా చెబుతుంటారు.
కొందరు ఈనైట్‌టెర్రర్‌ సమయంలో తీవ్రంగా భయపడినా వారికి నిద్రనుంచి మెలకువ రాకపోవచ్చు కూడా.
కాస్త కదిలినా మళ్లీ వెంటనే నిద్రలోకి కూరుకుపోతారు.
ఎవరిలో ఎక్కువ…పీడకలలు రావడం సాధారణంగా పదో ఏట నుంచి మొదలవుతుంది.
యుక్తవయస్కుల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. యువకులతో పోలిస్తే యువతులలో
ఇవి చాలా ఎక్కువ.కొంతమందిలో ఏవైనా ఇతర మానసిక సమస్యలునప్పుడు
వాటితో పాటు ఇవి కనిపిస్తుండటం చాలా సాధారణం.
కారణాలు              ♦ తీవ్రమైన ఒత్తిడి లేదా
యాంగై్జటీ కారణంగానే అవి వస్తుంటాయి♦  తీవ్రమైన జ్వరంతో బాధపడేవారిలో
♦ కుటుంబంలో ప్రియమైన వ్యక్తి చనిపోయినప్పుడు
♦ ఏదైనా మందుల దుష్ప్రభావం వల్ల
♦ నిద్రమాత్రలు వాడి మానేశాక లేదా బాగా ఆల్కహాల్‌ తీసుకునే
అలవాటు మానేశాక విత్‌డ్రావల్‌ సింప్టమ్‌గా
♦ గురక పెట్టడం (స్లీప్‌ ఆప్నియా)తో పాటు నిద్రరుగ్మతలు (స్లీప్‌ డిజార్డర్స్‌) ఉన్నవారిలో
♦ నిద్రకు ఉపక్రమించడానికి కాసేపు ముందే తిని పడుకున్నవారిలో
(ఇలా తిన్నప్పుడు వారి జీవక్రియలు వేగం పుంజుకోవడం, మెదడు చురుగ్గా ఉండటం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది).



Kalalu Vati Phalithalu Telugu Book Pdf Download
Kalalo Police Kanipiste
Swapna Sastram In Telugu Pdf Free Download
కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది
Swapna Phalithalu
Kalalu Vati Falitalu
Kalala Sastram In Telugu
Kalalo Malam Kanipiste

Post a Comment

Previous Post Next Post