Jeernodharana Vidhi In Telugu
జీర్ణోద్ధారణ విధి
-appala Shyam Praneeth Sharma
price;99/-
జీర్ణోద్ధార విధిః”
జీర్ణోద్ధారణ విధిః
(ద్వితీయ ముద్రణ)
ఆలయ వ్యవస్థలో కీలకమైన ప్రక్రియ జీర్ణోద్ధారణ. ప్రకృతి నియమాల వల్ల, లేదా ఇతర కారణాల వల్ల… ఆలయాలు, అందులోని మూర్తులు జీర్ణమైతే దానిని మార్చి నూతనంగా ఆలయాన్ని, మూర్తులను ఉద్దరణ చేసే ప్రక్రియే జీర్ణోద్ధారణ.
తెలుగునాట ప్రతిష్ఠా విధులు, క్రియలకు సంబంధించి అనేక గ్రంథాలు అందు బాటులో ఉన్నాయి. అయితే వాటిలో జీర్ణోద్ధారణ విషయాలు నామమాత్రంగానే కనబడుతున్నాయి. వాటిని అనుసరించి ఈ ప్రక్రియను నిర్వహించడం పండితులకు సైతం కష్ట సాధ్యమే. దీనిని దృష్టిలో ఉంచుకుని అనేక ఆగమ, పురాణ గ్రంథాలను పరిశీలించి వేదోక్తంగా, సశాస్త్రీయంగా సంకలనం చేసినదే ఈ “జీర్ణోద్ధారణ విధిః” గ్రంథము.
ఈ గ్రంథం మొదటి ముద్రణ జరుగుతుండగానే ప్రతుల కోసం వందలాది ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. అతి తక్కువసమయంలోనే ప్రతులన్నీ చెల్లిపోయాయి. దాంతో చాలామంది మేము గ్రంథాన్ని పొందలేకపోయామని, ద్వితీయ ముద్రణ చేయమని ఆనాటి నుంచి అడుగుతూనే ఉన్నారు. అలాంటి వారందరి ప్రేరణతో ఈ గ్రంథం ప్రస్తుతం ద్వితీయ ముద్రణ పొందడం చాలా ఆనందదాయకమైన విషయం.
మొదటి ముద్రణకు అదనంగా ఈ ద్వితీయ ముద్రణలో పేజీలసంఖ్యను పెంచి జీర్ణోద్ధారణకు అవసరమైన మరికొన్ని అంశాలను జత చేసినాను. అవి వైదికులకు ఎంతో ఉపకరిస్తాయి.
జీర్ణోద్ధారణ విధిః
అప్పాల శ్యాంప్రణీత్ శర్మ అవధానిపుటలుః 64
వెలః 99రూ.లు (పోస్టేజి అదనం)
Post a Comment