Gayatri Tantram గాయత్రీ తంత్రం

 Gayatri Tantram

గాయత్రీ తంత్రం


price;200/-

Gayatri Tantram Book

గాయత్రీ తంత్రం

 ఈ విశ్వంలో అత్యంత శక్తిమంతమైనది శబ్దం. మన రుషులు ఈ శబ్ద శాస్త్రం(ఫొనోటిక్స్‌)లో నిష్ణాతులు. మనకు వారసత్వంగా వచ్చిన మంత్రాల వెనక పెద్ద శాస్త్రం దాగి ఉంది.
ఈ మంత్రాలను ఉచ్ఛరించే సమయంలో వచ్చే శబ్దంలో శక్తి దాగి ఉంటుంది. దీనిని మనం ఇంకో కోణం నుంచి కూడా విశ్లేషించవచ్చు.
ఏదైనా వస్తువు వేగంగా తిరుగుతున్నప్పుడు దాని నుంచి శబ్దం వెలువడుతుంది. ఇదే విధంగా గ్రహాలు కక్షలో తిరుగుతున్నప్పుడు శబ్దం వెలువడుతుంది.
గెలాక్సీల చుట్టూ సౌరవ్యవస్థలు వేగంగా తిరుగుతున్నప్పుడు శబ్దం ఏర్పడుతుంది. ఈ శబ్దాలకు అపారమైన శక్తి ఉంటుంది. వీటిని సామాన్యులు వినలేరు.
ఓం అనే శబ్దం సౌరవ్యవస్థలు తిరిగినప్పుడు ఏర్పడే శబ్దానికి సరిసమానంగా ఉంటుంది. విశ్వామిత్రుడు ఈ శబ్దాన్ని కనిపెట్టాడని చెబుతారు.
విశ్వమిత్రుడు రూపొందించిన మరొక మంత్రం-గాయత్రి.
ఓం బుహుర్‌, బువహ, సువహ
తత్వవితుర్వరేణ్యం
భర్గో దేవశ్య దీమహి
ధీయోయోన ప్రచోదయాద్‌- అనే ఈ మంత్రం వెనక శాసీ్త్రయ అంశాలను ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉంటారు. మొదటి వాక్యానికి అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
బుహుర్‌ అంటే భూమి. బువహ అంటే ఈ సూర్యుడు కేంద్రబిందువుగా ఉన్న మన విశ్వం. సువహ అంటే మనకు సుదూరంలో ఉన్న కోట్లాది విశ్వాలు. ఇవన్నీ తిరుగుతున్నప్పుడు ఏర్పడే శబ్దమే ఓం.
ఇక రెండో వాక్యం విషయానికి వస్తే- తత్‌ అంటే భగవంతుడు. సవితుర్‌ అంటే ఆ భగవంతుడు సూర్యుడి రూపంలో ఉన్నాడు. వరేణ్యం అంటే అలాంటి భగవంతుడికి ప్రణామాలు అర్పిద్దాం అని అర్థం.
ఇక మూడో వాక్యానికి వస్తే- భర్గో అంటే కాంతి అని అర్ధం. దేవశ్య అంటే కాంతి రూపంలో ఉన్న దేవుడిని.. ధీమహి అంటే ధ్యానం చేద్దాం అని అర్థం.
నాలుగో వాక్యంలో ధీయో అంటే మా మేధను యో అంటే ఆ భగవంతుడు ప్రచోదయాత్‌ అంటే సరైన మార్గంలో ప్రయాణించేలా మార్గం చూపించుగాక.. అని అర్థం


Gayatri Tantra Pdf
Tantric Mantras List
Tantric Mantras For Wealth
Most Powerful Tantra Mantra
Tantric Mantra For Love
Bangla Tantra Mantra
Tantra Mantra For Success
Tantra Mantra Yantra



Post a Comment

Previous Post Next Post