Bhava Manjari Telugu
ఆచార్య ముకుంద దైవజ్ఞ విరచిత
భావ మంజరి
– శ్రీపుచ్చా శ్రీనివాసరావు,
– శ్రీ అప్పల శ్రీనివాసశర్మ
price ; 150/-
జాతక ఫలితాలను తెలియచేయడానికి అనేక ప్రమాణిక గ్రంథములు ఉన్నప్పటికి, జాతకంలో వివిధ భావాలలోని గుప్తమైన విచారణచేయడానికి ఉపకరించే తెలుగు గ్రంథములు తక్కువే. దీనిని దృష్టిలో పెట్టుకుని భావములను సమగ్రంగా విచారణచేసే చిన్న గ్రంథమే భావమంజరి. 9 అధ్యాయాలు కలిగిన ఈ రచనలో 6అధ్యాయాలు భావగ్రహ, భావవృద్ధి,భావహాని, భావోపచ యాపయ, భావఫల కాలబోధ ప్రకరణాలతో వివరణలతో సాగుతుంది. ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత గమనించిన మహామహోపాధ్యాయ, జ్యోతిష విజ్ఞానభాస్కర, కీ.శే.మధుర కృష్ణమూర్తిశాస్త్రిగారు ఈ 6 అధ్యాయాలను 1985-88సం.ల మధ్య వారి శిష్యులకు పాఠంగా చెప్పడంతో దానిని నోట్సుగా వ్రాసుకోవడం జరిగింది. ఇంతటి అమూల్య గ్రంథాన్ని జ్యోతిషాభిమానులకు అందివ్వాలనే సంకల్పంతో మోహన్ పబ్లికేషన్స్ వారు ముద్రించి పరిచయం చేయడం జరుగుతోంది. ఈ నోట్సు వ్రాసుకున్న వారి శిష్యులు శ్రీపుచ్చా శ్రీనివాసరావు, శ్రీ అప్పల శ్రీనివాసశర్మ మొదటి రెండు అధ్యాయములకు అర్ధం వ్రాయడం జరిగింది. ఇది సమగ్రంగా చదివితే జాతక విచారణ విధానం సులభంగా తెలుస్తుదని చెప్పవచ్చను.
Post a Comment