32 NAMES GANAPATHI
SIDDI BUDDHI GANAPATHI
32 గణపతులు
ప్రధానంగా గణపతుల సంఖ్య 21 (కనుకనే ఏకవింశతి పత్రపూజ చేస్తారు). ఇంకా అవాంతర భేదగణపతులు 11 - మొత్తం 32
1 శ్రీ గణపతి 2 వీర గణపతి 3 శక్తి గణపతి 4 భక్త గణపతి 5 బాల గణపతి 6 తరుణ గణపతి 7 ఉచ్చిష్ట గణపతి 8 ఉన్మత్త గణపతి 9 విద్యా గణపతి 10 దుర్గ గణపతి 11 విజయ గణపతి | 12 వృత్త గణపతి 13 విఘ్న గణపతి 14 లక్ష్మీ గణపతి 15 నృత్య గణపతి 16 శక్తి గణపతి 17 మహా గణపతి 18 బీజ గణపతి 19 దుంఢి గణపతి 20 పింగళ గణపతి 21 హరిద్రా గణపతి 22 ప్రసన్న గణపతి |
23 వాతాపి గణపతి
24 హేరంబ గణపతి
25 త్ర్యక్షర గణపతి
26 త్రిముఖ గణపతి
27 ఏకాక్షర గణపతి
28 వక్రతుండ గణపతి
29 వరసిద్ధి గణపతి
30 చింతామణి గణపతి
31 సంకష్టహర గణపతి
32 త్రైలోక్యమోహనగణపతి
GANAPATHI TEMPLES IN INDIA IN TELUGU LANGUAGE
దేవాలయాలు
దేశంలో కొన్ని మందిరాలు ప్రధానంగా వినాయకుని మందిరాలుగా ఉంటాయి (ఉదాహరణకు కాణిపాకం). అయితే అనేక (దాదాపు అన్ని) దేవాలయాలలోను వినాయకుని ప్రతిమ లేదా ఉపాలయం లేదా అంతరాలయం ఉండడం జరుగుతుంది. కోటలు, రాజప్రాసాదాలు, ఇళ్ళు, వీధులు, రావిచెట్టు - ఇలా అనేక స్థానాలలో గణపతి విగ్రహం ప్రతిష్టిస్తుంటారు. ప్రత్యేకంగా వినాయకుడు ప్రధాన దైవంగా ఉన్న లేదా గణపతి పూజకు ప్రాముఖ్యత ఉన్న కొన్ని
ఆలయాలు -
- ఆంధ్ర ప్రదేశ్ - కాణిపాకం
- మహారాష్ట్ర - వై, మోరెగావ్
- మధ్య ప్రదేశ్ - ఉజ్జయిని
- రాజస్థాన్ - జోధ్ పూర్, నాగోర్, రాయిపూర్ (పాలి)
- బీహార్ - బైద్యనాధ్
- గుజరాత్ - బరోడా, ఢోలక్, వల్సాద్
- ఉత్తరప్రదేశ్ - వారాణసి (ధుండిరాజ్ మందిరం),
- కేరళ - తిరుచిరాపల్లి (జంబుకేశ్వర మందిరం - ఉచ్చి పిళ్లైయార్ కొట్టై), పిళ్లైయార్ పట్టి(కర్పగవినాయక మందిరం), రామేశ్వరం, సుచీంద్రం
- కర్ణాటక - హంపి, కాసరగోడ్, ఇదగుంజి
అష్ట వినాయక మందిరాలు
మహారాష్ట్రలో పూణె సమీపంలో (100 కిలోమీటర్ల పరిధిలో) ఉన్న ఎనిమిది ఆలయాలను అష్టవినాయక మందిరాలంటారు. ఒక్కొక్క ఆలయంలోను గణపతి ఒక్కొక్క రూపంలో పూజలు అందుకొంటాడు.
- మోరెగావ్, అష్టవినాయక మందిరం pune to morgaon 80 km
- సిద్ధి వినాయక మందిరం, సిద్ధాటెక్ pune to Siddhatek 111 km
- బల్లాలేశ్వర మందిరం, పాలి pune to Ballaleshwar Pali 119 km
- వరద వినాయక మందిరం, మహాడ్ pune to mahad 130 km
- చింతామణి మందిరం, తియూర్ pune to Theur 28 km
- గిరిజాత్మజ మందిరం, లేయాంద్రి pune to Lenyadri 97 km
- విఘ్నహర మందిరం, ఒజార్ pune to Ozar 223 km
- మహాగణపతి మందిరం, రంజనగావ్ pune to Ranjangaon, 52 km
వీటిలో ముందుగా మోరేశ్వర మందిరాన్ని దర్శించే సాంప్రదాయం ఉంది.
- కాణిపాకం
ప్రధాన వ్యాసం: కాణిపాకం
కాణిపాకం, చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన గ్రామము. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది. తిరుపతి నుండి ప్రతి 15 నిమిషములకు ఒక బస్సు కలదు. చిత్తూరు నుండి ప్రతి ముప్పై నిముషాలకు ఒక బస్సు కలదు. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలగునవి లభించును.
కాణిపాకంలో కొలువు తీరిన వినాయకునికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు అనడానికి ఎన్నో నిదర్శనాలున్నాయని, స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది.
Post a Comment